Station Ghanpur Land Dispute
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
తన భూమి లోకి వెళ్లకుండా దారి మూసాడని అన్న పై తమ్ముడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉదంతం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో వెలుగులోకి వచ్చింది.
బాధితుడు చల్లా సంపత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కథనం ప్రకారం… తన సొంత వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా తన అన్న చల్ల నరసింహారెడ్డి అక్రమంగా కనీలు పాతి ఫినిషింగ్ వైర్ కట్టి సొంత భూమిలోకి వెళ్లకుండా దారిని మూసి వేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
గతంలో ఈ విషయమై ప్రజావాణిలో, రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపాడు. పెద్దమనుషుల సమక్షంలో ఎవరి భూమికి వారు హద్దులు పెట్టుకున్నామని తాను లేని సమయంలో నా భూమిలోకి వెళ్ల కుండా బాటను మూసి వేశాడని తమకు న్యాయం చేసి దారిని ఇప్పించాలని పోలీసులను కోరడం జరిగిందన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
