Udhayanidhi Stalin Bail
* మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, డెస్క్: డిఎంకే ప్రముఖ నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల దర్యాప్తునకు ఆయన సహకరించాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం, స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తూ, వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదు అయిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం విడుదల చేస్తామని, కస్టడీలో ఉంచబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుతో డిఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నాయి. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
