iQOO Z11 India Launch
* MediaTek Dimensity 7500 Turbo చిప్‌తో తొలి iQOO ఫోన్
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారత మార్కెట్లో తన కొత్త iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్, భారత్‌లో మాత్రం పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో రాబోతోంది. iQOO ఇండియా సీఈఓ నిపున్ మార్యా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అధికారిక చిత్రాల్లో ఈ కొత్త లుక్ కనిపించింది. కెమెరా డిజైన్, బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్ పూర్తిగా మారడం టెక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
* డిజైన్లోనే పెద్ద ట్విస్ట్!
భారత్‌కు రానున్న iQOO Z11లో వెనుక భాగంలో పిల్-షేప్ కెమెరా మాడ్యూల్ అందించారు. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరాలతో పాటు LED రింగ్ లైట్ కూడా ఉంది. మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, 3D కర్వ్డ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి. పవర్, వాల్యూమ్ బటన్లు కుడివైపు ఉండగా, పైభాగంలో స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్లను అమర్చారు.
* ఫస్ట్ టైమ్ ఈ ప్రాసెసర్‌తో వస్తోంది
భారత్‌లో విడుదలయ్యే iQOO Z11లో MediaTek Dimensity 7500 Turbo చిప్‌సెట్‌ను అందించనున్నారు.
ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో విడుదలవుతున్న తొలి iQOO ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే చైనా వెర్షన్లో మాత్రం Dimensity 8500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. కొత్త చిప్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నెలలోనే భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
* చైనా మోడల్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?
చైనాలో విడుదలైన iQOO Z11లో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది.
కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే భారత్‌లో లాంచ్ కానున్న మోడల్లో కొన్ని స్పెసిఫికేషన్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
The companion behind every campus ambition!
Launching on 20th August. #iQOOZ11 #FasterSmarterwithAI pic.twitter.com/Efap8jQY8C
— Nipun Marya (@nipunmarya) August 5, 2026
Please tell us what is wrong. Your report will be sent to the website team.
