Hyderabad Indiramma Housing Allocation
* కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు ఆశ్చర్యం
* ధనవంతులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారని ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు అది. లోపల చూస్తే ఇంటీరియర్‌తో ధగధగలాడుతుంది. ధనవంతుల ఇళ్లను తలపిస్తుంది. పోనీలే పేదవాడు ఇల్లు మంచిగా ఉండకూడదా అనుకుంటే పొరపాటే. అది డబ్బున్న అనర్హులకు కేటాయించారని ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు కేటాయిస్తోంది అనడానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాటరీ ద్వారా నిజమైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తే, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమైన వారికి కేటాయిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం కైత్లాపూర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని సందర్శించారు. అక్రమార్గంలో ఇండ్లు సంపాదించిన వారు రూ.15 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేస్తున్నట్లు గుర్తించి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు.
* కైతలాపూర్ ఇల్లు ఖమ్మం చెందిన వ్యక్తికి..
గత ప్రభుత్వంలో హైదరాబాద్ ఖైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఖమ్మానికి చెందిన వ్యక్తికి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నిజమైన లబ్ధిదారులు లేరా? లాటరీ కాకుండా ఇష్టరీతిన కేటాయింపులు చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అని ప్రశ్నించారు. జలమండలి, ఇంజనీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి అక్కడ నివాసం ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ షట్టర్స్ ఒక్కోటి రూ.20లక్షలకు అమ్ముకొని ఆ డబ్బు ఏం చేశారన్నారు. ప్రహరీ నిర్మాణం, పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కైత్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉండే 87 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరిశీలించి వారికి డబుల్ ఇల్లు పారదర్శకత పాటిస్తూ కేటాయించాలని అధికారులను కోరారు.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
