NTR Dragon Movie Shoot Resumes at Ramoji Film City
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఇటీవల డ్రాగన్ షూట్ లో ఎన్టీఆర్ గాయపడ్డారు.. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయంలో ఖాళీ ఉండటం ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరోతో సంబంధం లేని సీన్స్ చిత్రీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంకేముంది ముంబయి నుంచి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ హైదరాబాద్ కు వచ్చారట.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న చిత్రీకరణ కోసమే వచ్చినట్లు టాక్. డ్రాగన్ గ్లింప్స్ లో తారక్ సహా అందరినీ విలన్స్ గా పరిచయం చేయడం, వాళ్ళని ఆపడానికి వచ్చే హీరోస్ లో ఒకరిగా బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ను చూపడం విదితమే. అయితే కొన్ని నెలల క్రితం తారక్ నటించిన వార్ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందలేకపోయింది. ఇక మాటల మంత్రికుడు త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్టు ఉండనున్నట్లు తెలిసింది. ఇది సోషియోఫాంటసీ, యాక్షన్ చిత్రం. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రానున్నది. డ్రాగన్ మూవీకి సంగీతం రవి బసృర్. నిర్మాణం త్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ .
Please tell us what is wrong. Your report will be sent to the website team.
