Pakhal Lake Suicide,
Published:
* ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య..
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ తల్లి సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతులను గీసుగొండ మండలం హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి మమత, ఆమె ఇద్దరు కుమార్తెలుగా గుర్తించినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు. ముగ్గురి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.

