Nitish Malhotra's Ramayana Movie Cast
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
రామాయణ.. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటబ్బా అనేగా అనుకుంటున్నది.. ఆగండి ఈ విషయానికే వస్తున్నా.. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం.. బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, కేజీఎఫ్ ఫ్రేం నటుడు యాష్ లు రాముడు, సీత.. రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాష్ ఎలా భాగమయ్యాడో నిర్మాత నమిత్ మల్హోత్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామాయణం చిత్రాన్ని అత్యంత భారీగా తీయాలి అనే సమయంలో నేను లాస్ ఏంజెల్స్ లో ఉన్నా. ఐదేళ్ల కితమే యష్ నటించిన కేజీయఫ్ చాప్టర్ 2 చూసి రామాయణలో రావణ పాత్రకు యష్ సరిగా సరిపోతాడని భావించా . అప్పటికి నేను యష్ ను కలిసింది కూడా లేదన్నారు. అయితే యష్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం అయ్యేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తుంది.
ఇటీవల ‘రామాయణ’ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. యావరేజ్..గానే ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అంతేనా.. శ్రీరామ్లీలా సంఘ్ మహావీర్ సంస్థ ప్రతినిధులు … ట్రైలర్ రిలీజ్ అయ్యాక ‘రామాయణ’ నిర్మాతకు వార్నింగులు ఇస్తూ లేఖలు పంపారు. .‘‘ వక్రీకరించే విధంగా తీస్తే మాత్రం సహించం. రిలీజ్ కు ముందు మాకు పూర్తిగా సినిమా చూపించాలి. ఆమోదం పొందాకే విడుదల చేయాలి అంటూ’’ లేఖలో పేర్కొన్నారు. ఈ మూవీకి సంగీతం హన్స్ జిమ్మర్, రెహమాన్ లు. ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
