12-Foot Python Attacks Woman in Jangaon Maize Field
* మహిళపై దాడి..
* ఆమె కోలుకుంటోంది
-డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి
ఆకేరు న్యూస్, జనగామ :
మొక్క జొన్న చేనులో పనిచేసుకుంటున్న మహిళపై ఒక్క సారిగా కొండ చిలువ దాడి చేసింది.
జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ ఊహించని పరిణామంతో భయంతో పరుగులు పెట్టడానికి ప్రయత్నించింది.. ఆమె అరుపులు విన్న చుట్టు పక్కల ఉన్న వారు పరుగున అక్కడికి చేరుకున్నారు.. వారి మీదకు కూడా దాడికి ప్రయత్నం చేస్తుండడంతో దాన్ని చంపేశారని తెలిసింది. అనంతరం అమెను వైద్యం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 12 ఫీట్లు పొడవున్న భారీ కొండ చిలువను సైతం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి ఆమెకు చికిత్స అందించారు. ఇపుడు ఆమె కోలుకుంటోందని, ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్ బిక్షపతి చెప్పారు.. ఇలాంటి పాములు కనిపించినప్పుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని పాములను చంపకూడదని డాక్టర్ బిక్షపతి వారికి వివరించారు..
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
