KTR Revanth Reddy Criticism
* రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్, పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, వ్యవసాయ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం పట్టింపు లేదని ఆరోపించారు.
‘మేం ముళ్ల కర్రతో పొడిచే వరకు సీఎంకు సమస్యలు తెలియట్లేదు’ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము పాలమూరుకు వస్తున్నామని చెప్పగానే పంపులను ఆన్ చేశారని విమర్శించారు.
* యాగాలతో పాటు బాధ్యతలు కూడా నిర్వర్తించాలి
యాగాలు చేయడంలో తప్పేమీ లేదని కేటీఆర్ అన్నారు. అయితే యాగాలతో పాటు ముఖ్యమంత్రి తన బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. రైతుల సమస్యలను పట్టించుకుని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం శ్రద్ధ లేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం దృష్టిలో భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమేనని ఆరోపించారు.
రైతుల సమస్యలు, సాగునీటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
