Mission Bhagiratha Pipeline Burst
* వాహనదారులకు తప్పని తిప్పలు
ఆకేరు న్యూస్, వరంగల్: మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం ఎస్సారెస్పీ కెనాల్‌పై ఉన్న బ్రిడ్జిపై మిషన్ భగీరథ పైపు పగిలినట్లు స్థానికులు తెలిపారు.
పైపులైన్ నుంచి అధిక నీటి ప్రెషర్‌తో నీరు రోడ్డుపైకి రావడంతో బ్రిడ్జిపై భారీగా నీరు ప్రవహిస్తోంది. దీంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీటి ప్రవాహం కారణంగా బైకులు, ఇతర వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో బ్రిడ్జిపై ఇరువైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది.
* ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు
బ్రిడ్జిపై నీరు నిరంతరం ప్రవహిస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌ను మరమ్మతు చేసి నీటి ప్రవాహాన్ని అరికట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జిపై తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
