Mahesh Babu Varanasi Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలు వస్తున్న వారణాసి. మహేష్ బర్త్ డే కావడంతో ఈ చిత్రం నుంచి రెండు స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆఫ్రికా షూట్ లో ఉన్నప్పటి ఫొటోలుగా యూనిట్ పేర్కొంది. అందులో వెనుక నుంచి చూస్తున్నట్లు ఒకటి.. రెండోది పడుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో మరొకటి విడుదల చేసింది. అయితే టీజర్ వస్తుందేమోనని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూశారు.. కానీ ఫొటోలే రిలీజ్ చేయడంతో కొంత నిరాశకు లోనయ్యారు.
* డైరెక్టర్ ..స్ట్మార్ట్ జడ్జిమెంట్
అయితేస్టార్ డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యలు మహేష్ అభియానుల్లో నాయా జోష్ నింపుతున్నాయి. ‘‘రుద్ర క్యారెక్టర్లో మహేష్ కనిపిస్తా డు. ఒక కారణ జన్ముడు, సున్నితంగా కనిపిస్తూనే అవసరమైన సమయంలో రుద్రుడిగా తాండవం కూడా చేస్తాడని కొనియాడారు. అయితే రౌద్రంగా ఎవరైనా చేస్తారు కానీ సున్నితత్వంతో కూడిన యాక్టింగ్ చేయడం చాలా తక్కువ. ఇది నేను మహేష్ లో చూశా ” అని తెలిపారు.
* పుట్టిన రోజు శుభాకాంక్షలు..
సోషల్ మీడియాలో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ .. ఐ లవ్ యూ సో మచ్, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని విషెస్ చేశారు. తాను, మహేష్, పిల్లలు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా మహేష్ మీరు మరెన్నో విజయాలు సాధించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కోరుకున్నారు. హ్యాపీ బర్త్ డే మై డియర్ మహేష్ .. అగ్రహీరోగా ఎదగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నా చిన్నోడు మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని విక్టరీ వెంకటేష్ చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
