Naga Chaitanya
* డిసెంబర్ 4న విడుదల
ఆకేరు న్యూస్, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే అటిట్యూడ్, ఎనర్జిటిక్ బీట్స్‌తో నాగ చైతన్య కొత్త అవతారంలో కనిపించారు. ముఖ్యంగా ‘ఐయామ్ బార్న్ టు రూల్’ అనే క్యాచ్లైన్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య
‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పాటలో నాగ చైతన్య పోషిస్తున్న అర్జున్ పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. సినిమాలో ఆయన ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. సాహస యాత్రకు సిద్ధమవుతున్న వ్యక్తిగా స్టైలిష్ అవతార్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీలో నాగ చైతన్య వేసిన స్టైలిష్ స్టెప్పులు పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అజనీష్ లోక్‌నాథ్ మ్యూజికల్ ట్రీట్
ఈ పాటకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. అభినవకవి అందించిన సాహిత్యం అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను ప్రతిబింబిస్తోంది. ట్రెండీ బీట్స్, ఆకట్టుకునే లిరిక్స్‌తో పాటకు మంచి ఎనర్జీ వచ్చింది. ఈ సింగిల్‌తో ‘వృషకర్మ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను చిత్రబృందం ప్రారంభించింది.
భారీ తారాగణంతో ‘వృషకర్మ’
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రహస్యాలు, సాహసాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందుతున్న ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అర్జున్ పాత్రతో ఇప్పటికే ఆసక్తి పెంచిన నాగ చైతన్య.. వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

