Warangal Police ARSI Samuel
ఆకేరు న్యూస్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్. శామ్యూల్ (57) సోమవారం ఉదయం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.
హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట జంక్షన్ సమీపంలోని తన నివాసం నుంచి విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో శామ్యూల్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించినప్పటికీ ఆయన మృతి చెందినట్లు సమాచారం.
శామ్యూల్ 1989లో పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరారు. సుమారు 37 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ విధి నిర్వహణలో తన వంతు సేవలు అందించారు.
శామ్యూల్ ఆకస్మిక మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శామ్యూల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
