Jawans Avert Train Accident
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మధ్యప్రదేశ్ లో క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ జవాన్ల సమయస్ఫూర్తి, అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం సాగర్-దమోహ్ రైల్వే మార్గంలోని మక్రోనియా-గుడా రైల్వే క్రాసింగ్ వద్ద సరుకుతో నిండిన ఒక ట్రక్ రైల్వే గేటు దాటుతుండగా అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ పై ఆగిపోయింది. అదే సమయంలో 10వ బెటాలియన్ స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF) క్యూఆర్టీ బృందం శాంతిభద్రతల పరిరక్షణ కోసం వెళ్తూ రైల్వే గేటు వద్ద నిలిచి ఉంది.
ట్రక్ నిలిచిపోవడం, రెండువైపులా రైల్వే ట్రాక్ లో రైల్వే సిగ్నల్స్ ఆకుపచ్చగా మారి రైలు రాకను సూచించడంతో వచ్చే ప్రమాదకర పరిస్థితి తీవ్రతను గమనించిన క్యూఆర్టీ సిబ్బంది ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన ట్రక్కును సురక్షిత దూరం వరకు నెట్టివేశారు. జవాన్ల ఈ స్పందన, స్ఫూర్తి వందలాది మంది ప్రాణాలను కాపాడిందని స్థానికులు, పోలీసు అధికారులు కొనియాడగా, ఈ సాహస ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ పోలీసు శాఖ అధికారిక ఎక్స్ వేదికగా ప్రశంసించింది.ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ జవాన్ల పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్పబోగా జవాన్లు వద్దని వారించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
