బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురి మృతి
* బావిలో విషవాయువులు పీల్చడంతో ప్రమాదం
* ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : బావిలో విషవాయువుల పీల్చి ఐదుగురు మృతి చెందారు. ఓ చెక్క ముక్క కోసం బావిలోకి దిగి పైకి రాని వ్యక్తి కోసం ఒకరు.. అతడు రాకపోతే మరొకరు.. అతడిని కాపాడేందుకు ఇంకొకరు.. ఇలా బావిలోకి దిగి చనిపోయారు. ఛత్తీస్‌గఢ్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్ర జైశ్వాల్ అనే వ్యక్తి బావిలో పడిపోయిన చెక్క ముక్క కోసం అందులోకి దిగాడు. అయితే, అతను ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సాయం కోసం స్థానికులను ఆశ్రయించారు. దీంతో జైశ్వాల్‌ను రక్షించేందుకు రమేశ్ పటేల్, రాజేంద్ర పటేల్, జితేంద్ర పటేల్ ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు బావిలోకి దిగారు. కానీ ముగ్గురూ కూడా తిరిగి రాలేదు. ఆ తర్వాత టికేశ్వర్ చంద్ర అనే వ్యక్తి కూడా అందులోకి వెళ్లాడు. అతడు కూడా బయటకు రాలేదు. దీంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. బావిలోని విషవాయువు పీల్చి వారంతా చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు బావిలోంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీసేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ప్రయత్నిస్తోందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ శుక్లా తెలిపారు.
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
