Navodaya Class 9 11 Admissions
* దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30
ఆకేరు న్యూస్, వరంగల్ : మామునూర్లోని పి.ఎం. శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న 9వ మరియు 11వ తరగతుల సీట్ల భర్తీకి ప్రకటన వెలువడింది. ‘లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్-2027’ (JNV LEST-2027) ద్వారా ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ టి. రమేష్ వెల్లడించారు. ఈ అవకాశం వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
* వయోపరిమితి.. విద్యార్హతలు..
9 వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 01-05-2012 నుండి 31-07-2014 మధ్య జన్మించి ఉండటంతో పాటు, ప్రస్తుతం (2026-27 విద్యా సంవత్సరంలో) ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే 11వ తరగతి ప్రవేశాల కోసం విద్యార్థుల జన్మదినం 01-06-2010 నుండి 31-07-2012 మధ్య ఉండాలని మరియు ప్రస్తుతం 10వ తరగతి అభ్యసిస్తూ ఉండాలని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు బాలికలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతాయి.
* దరఖాస్తు విధానం.. పరీక్ష తేదీ
అర్హత కలిగిన ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 నాటికి నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2027 ఏప్రిల్ 10న ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
