Banded Krait Snake, Warangal Pakhal Lake
* ‘బ్యాండెడ్ క్రైట్’ పామును అటవీశాఖకు అప్పగించిన యువకులు
ఆకేరు న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ (పాకాల) సమీపంలో అరుదైన, అత్యంత విషపూరితమైన ‘బ్యాండెడ్ క్రైట్’ (Banded Krait) పాము ప్రత్యక్షమైంది. శరీరమంతా నలుపు, పసుపు రంగు చారలతో ఉన్న ఈ సర్పం స్థానికుల కంట పడింది.
సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాష్ అనే యువకులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. పాముకు గానీ, ఎవరికీ గానీ ఎలాంటి హాని కలగకుండా దానిని సురక్షితంగా పట్టుకుని, వెంటనే పాకాల అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న FSO ధర్మ, జయప్రకాష్, విజయ్, రాజు, మహేష్‌లతో కూడిన అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని పామును ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం దానిని పాకాల అభయారణ్యంలోకి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. పామును చాకచక్యంగా పట్టుకుని అటవీశాఖకు అప్పగించిన స్థానిక యువకులను అటవీ అధికారులు అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
