LB Nagar Constable Saikumar Suicide
* అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
* పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తెల్లవారుజామున కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లో అతడు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన PC J. సాయికుమార్ (13128) 2024 బ్యాచ్‌లో కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నారు.
* ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్
ప్రస్తుతం సాయికుమార్‌ను ఈ -కాప్స్ విధుల నిమిత్తం ఉన్నతాధికారులు ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇదిలాఉండగా ఆయన తెల్లవారుజామున 2.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లోనే ఉరేసుకుని మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సాయికుమార్ ను వెంటనే అతడిని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
* కుటుంబ సభ్యుల ఆందోళన
సాయికుమార్ ఆత్మహత్యతో ఎల్బీనగర్. పోలీస్ స్టేషన్ ముందు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే అతడు మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలపాలని కోరారు. సాయికుమార్ మృతితో తమ కుటుంబం దిక్కులేనిదైందని వాపోతున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబానికి అండగా ఉంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
