Hanamkonda Collector Chahat Bajpai
* హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాద్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు
ఆకేరు న్యూస్, హనుమకొండ:
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి నగరానికి విచ్చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాద్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కలెక్టర్‌ను కలిసి, వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కలెక్టర్‌కు జిల్లా ఉద్యోగుల తరఫున స్వాగతం పలికారు.
అనంతరం జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్, మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సంక్షేమానికి కలెక్టర్ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. భవిష్యత్తులోనూ జిల్లా పరిపాలనను మరింత వేగవంతం చేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, కేంద్ర సంఘ ఉపాధ్యక్షులు రాములు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా, జిల్లా బాధ్యులు రమేష్,నిఖిల్,ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జీవోస్ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
