CPS OPS Teachers Demand
* ఓపిఎస్ ను పునరుద్ధరించాలి
– ఐక్య ఉపాధ్యాయ కమిటీ డిమాండ్.
ఆకేరు న్యూస్, ములుగు :
ప్రభుత్వ ఉద్యోగుల అపరిస్కృత సమస్యలు తో పాటు కొత్త పెన్షన్ (సిపిఏస్) విధానాన్ని రద్దు చేసి ,పాత పెన్షన్ (ఓపిఎస్)విధానాన్ని పునరుద్ధరించాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో 29 డిమాండ్ లతో కూడిన ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో యుటీఎఫ్ మండల ప్రెసిడెంట్ సుతారి పాపారావు , ప్రధాన కార్యదర్శి అలెం భాస్కర్ , డి టి ఎఫ్ జనరల్ సెక్రటరీ రేగ నరేంద్ర కుమార్ , కార్యదర్శి లక్ష్మయ్య తోపాటు ఉపాధ్యాయులు రామారావు, ప్రభాకర్ ,రవికుమార్ ,లక్ష్మణ్ రావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
