Ponnam Prabhakar, BC Women Sewing Machines
* బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు
– రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చూడుతోందని రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ మిషన్లను అందించనున్నారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని, రేపు ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని జీ-29 హాల్లో ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కానుందని మంత్రి పొన్నం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి సమగ్ర వివరాలను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
