Thatikonda Former Sarpanch Death
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ మాజీ సర్పంచ్ రాపోలు బుచ్చిరెడ్డి(95) శనివారం మృతి చెందారు.1970 నుండి 1982 వరకు రెండు పర్యాయాలకు పైగా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన రాపోలు బుచ్చిరెడ్డి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయనకు భార్య నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
* “ఎమ్మెల్యే పరామర్శ”
మాజీ సర్పంచ్ రాపోలు బుచ్చిరెడ్డి మృతి చెందగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ సృజన శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, భేతి జైపాల్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, ఐలోని సుధాకర్, చల్ల నరసింహారెడ్డి, కోరుకొప్పుల మధు, దేశిని సతీష్, లావుడియా శ్రీనివాస్ గ్రామ, మండల నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
