Sreeleela Bollywood Debut update
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంతో ఆమె హిందీ తెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం.
* ముంబై షెడ్యూల్లో శ్రీలీల
చాలా కాలంగా షూటింగ్కు సంబంధించిన పలు వార్తలు, వాయిదాలపై ఊహాగానాలు వినిపించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తిరిగి పట్టాలెక్కింది. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల ముంబైలో జరుగుతున్న షెడ్యూల్లో పాల్గొంటూ తనకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే ఈ చిత్రంలో తన భాగానికి సంబంధించిన షూటింగ్లో ఎక్కువ భాగం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
* అనురాగ్ బసు దర్శకత్వంలో..
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, సంగీతం ప్రధానంగా సాగే ఈ కథలో కార్తీక్, శ్రీలీల జోడీ తొలిసారి కలిసి కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ తొలుత ‘ఆషికీ 3’గా ప్రచారంలోకి వచ్చింది. అయితే తర్వాత ఈ సినిమాను కొత్త కథతో రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజా ముంబై షెడ్యూల్తో సినిమా నిర్మాణం మరో కీలక దశలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
