Vikrant Massey 12th Fail
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
‘12th ఫెయిల్’ కోసం విక్రాంత్ పేరును దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ సిఫారసు చేశారట. అప్పటికే విక్రాంత్ నటించిన ‘ఎ డెత్త్ ఇన్ ది గున్జా’ ’, ‘మిర్జాపూర్’ను చోప్రా చూశారు. ఆయన నటన నచ్చినప్పటికీ.. అప్పటివరకు విక్రాంత్ ప్రధానంగా టీవీ నటుడిగానే గుర్తింపు తెచ్చుకోవడంపై సందేహం వ్యక్తం చేశారట. అయితే తాజాగా ఒక టాక్ షో లో 12 th ఫెయిల్ సినిమాకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు విధు వినోద్ చోప్రాతో తొలిసారి కలిసినప్పుడు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.
* మిమ్మల్ని ఇంట్లో ఉచితంగా చూస్తున్నారు..
‘‘మీతో ఎందుకు పనిచేయాలి? మీరు టీవీ నటుడు. ప్రజలు మిమ్మల్ని ఇంట్లో ఉచితంగా చూస్తున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని థియేటర్లో చూడటానికి టికెట్ ఎందుకు కొనాలి?’’ అని చోప్రా తనను ప్రశ్నించినట్లు విక్రాంత్ తెలిపారు. ఆ మాటలను తాను ప్రతికూలంగా తీసుకోలేదని.. అందులో కొంత నిజం, నిర్మాణాత్మక విమర్శ ఉందని భావించానని చెప్పారు. ‘‘నేను మీతో పనిచేయాలనుకుంటున్నాను’’ అని మాత్రమే దర్శకుడికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.
* ఆడిషన్ సమయంలో కూర్చున్న విధానమే
‘12th ఫెయిల్’ ఆడిషన్ సమయంలో విక్రాంత్ కూర్చున్న విధానం దర్శకుడిని ఎంతగానో ఆకట్టుకుందట. సినిమాలోని ప్రారంభ సన్నివేశంలో ప్రేక్షకులు చూసిన అదే పొజిషన్లో విక్రాంత్ ఆడిషన్ ఇచ్చారు. ఆ క్షణంలోనే మనోజ్ పాత్రకు విక్రాంత్ సరైన నటుడని చోప్రా భావించినట్లు నటుడు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
