Rayaparthy Dog Attack
Published:
* ఐదుగురికి గాయాలు
ఆకేరు న్యూస్, రాయపర్తి: ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో ఓ కుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో ఐదుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి వెళ్లే రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క విచక్షణరహితంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఊర కుక్కల సంఖ్య పెరుగుతున్నా గ్రామపంచాయతీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల బెడద నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
———————————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
