cm Revanth Reddy Mulugu Visit
* కాసేపట్లో ములుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
* ముస్తాబైన నూతన కలెక్టరేట్, మేడారం గద్దెల ప్రాంగణం..
ఆకేరు న్యూస్,ములుగు : కాసేపట్లో ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించునున్నారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సీఎం రాక నేపథ్యంలో మేడారం గద్దెల ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మరో రెండు గంటల్లో ములుగు జిల్లా నూతన సమీకృత కార్యాలయాల(కలెక్టరేట్)సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నూతన కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంతిపూల తోరణాలు, సప్తవర్ణ రంగులతో ఆకట్టుకునేలా సర్వహంగులతో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముస్తాబుచేశారు. సభాస్థలి వద్ద అతిథులు, ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో ప్రత్యేక సుందరీకరణ పనులు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నూతన కలెక్టరేట్ వద్ద ఎస్పీ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి ములుగు నుంచి అడుగు..
రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి ములుగు నుంచి అడుగు ముందుకు పడుతోంది.
గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. రూ.16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు వేదికగా నిలువనుంది. రెండు గంటల్లో భారీ అభివృద్ధి ప్రణాళికకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ములుగులో ఏర్పాటు చేసిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికతో రాష్ట్ర వ్యాప్తంగా 2,145 రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టానున్నారు. మొత్తం 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు మహర్దశ రాబోతోంది. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం చేయనున్నారు. జిల్లా అధికారులు పైలాన్ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ పైలాన్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్దమైంది.
* వనదేవతల సన్నిధిలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ..
ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో మేడారంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్లో నేడు 1:30 గంటలకు సీఎం మేడారం చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అధికారులతో కలిసి సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు సీఎం తన నిలువెత్తు బంగారాన్ని సమర్పించనున్నారు. మేడారం సన్నిధిలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ చేయబోతున్నారు. భక్తుల కోసం ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:10గంటల వరకు మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
2:30 గంటలకు ములుగు కు చేరుకుంటారు. 3:30గంటలకు ములుగు కలెక్టరేట్ ను ప్రారంభించానున్నారు. అనంతరం పరకాలలో జరుగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
