* నీట్ పరీక్ష రద్దు చివరి ఆప్షన్ మాత్రమే
* ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవం
* ఎంత మందికి చేరిందో తెలియాల్సి ఉంది
* నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు
* విచారణ గురువారానికి వాయిదా
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : నీట్ (NEET) పరీక్ష రద్దు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు చెందిన అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్ష రద్దు చివరి ఆప్షన్ మాత్రమే అని పేర్కొంది. నీట్ – యూజీ పరీక్ష రద్దు సహా పలు డిమాండ్లపై దాఖలైన 26 పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవమని, అది ఎంత మందికి చేరిందో తెలియాల్సి ఉందని జస్టిస్ చంద్రచూఢ్ (Justice Chandrachud) ధర్మాసనం పేర్కొంది. నీట్, జేఈఈలో సీటు ప్రతి ఒక్కరి కల అని, పరీక్షల రద్దు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. మళ్లీ పరీక్ష నిర్వహించడం అనేది ఆఖరి ఆప్షన్ కావాలి కానీ తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం కాదని పేర్కొంది. నీట్ రద్దుపై పిటిషన్లు వేసిన వారందరూ నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
—————————————