Congress Village Presidents Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఇప్పగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల మల్లయ్య, సముద్రాల గ్రామ శాఖ అధ్యక్షుడు గుండె అనిల్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం, సముద్రాల గ్రామ శాఖల నూతన అధ్యక్షుల ఎన్నిక సోమవారం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన సిద్ధారెడ్డి, కిషన్, బాల్ రెడ్డి, రాజిరెడ్డి, నాగరబోయిన శ్రీరాములు పర్యవేక్షణలో రెండు గ్రామాల అధ్యక్షులు ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా కత్తుల మల్లయ్య, గుండె అనిల్ మాట్లాడుతూ గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన ఈ అవకాశంతో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మందపురం రాణి అనిల్, కత్తుల కట్టయ్య, మాజీ అధ్యక్షులు గొడుగు రాజయ్య, జూలుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, మందపురం ఎల్ల గౌడ్, నాగ బండి సంతోష్, పల్లె రవి, సట్ల కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఇనుగల వెంకటేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు, బత్తుల కిరణ్, ఎం. స్వామి, డి.రాజు రెండు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
