Lions Club Shivunipalli
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ శివునిపల్లి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన వితరణ చేశారు. క్లబ్ సభ్యుడు బెల్లంకొండ ప్రశాంత్ వివాహ వార్షకోత్సవం సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ ఆవరణలో దాదాపు 100 మందికి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తుమ్మనపల్లి రవి కిరణ్, కార్యదర్శి పులి వినయ్ కుమార్, కోశాధికారి కందగట్ల శ్రీకాంత్, పూర్వ అధ్యక్షులు గౌరి శెట్టి అనిల్ పాల్గొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
