Jhansi Reddy Birthday
ఆకేరు న్యూస్,రాయపర్తి:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలను రాయపర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదుల కంటి రవీందర్ రెడ్డి, ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరం విశేషంగా ఆకట్టుకుంది. రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఈదుల కంటి రవీందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్యనాయక్, మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఝాన్సీ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆమె పుట్టినరోజున ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
