Konda sushmitha insta story and Bio sparks debate
* కొండా సుస్మిత పటేల్ ఇన్ స్టా లో మార్పు
* ఈ రోజు గీసుకొండలో సుస్మిత పటేల్ సంచలన ప్రకటన
* ఇటీవలే పరకాల అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డేనని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్ రెడ్డి ని మరోసారి ఆశీర్వదించండని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటనలో భాగంగా ప్రజలను కోరారు.. ఎప్పటి నుంచో పరకాల సీటు తమదేనని ప్రకటిస్తున్న కొండా మురళీధర్ రావు తమ దైన రాజకీయ వ్యూహం మొదలు పెట్టారు. గతంలో కూడా పరకాల నియోజకవర్గం మీద ఆధిపత్యానికి సంబందించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ మద్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. అధిష్టానం కలగ జేసుకుని తాత్కాళికంగా సమస్య పెద్దది కాకుండా సద్దుమణిగేలా చేశారు..
మరో సారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పరకాల ఆధిపత్య పోరాటానికి నిప్పు రాజేసినట్లయింది.. ఈ రోజు మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా కూతురు కొండా సుస్మిత పటేల్ పరకాలకు కాబోయే ఎమ్మెల్యేను నేనే అని ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈ మేరకు సుస్మిత ఇన్ స్టాలో కూడా అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే అన్న మార్పులు వచ్చాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ని పోచమ్మ మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెల్మెట్ల పంపిణీ చేస్తారు.. గీసుకొండలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో పరకాల నుంచే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మరోసారి స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరికి బాసటగా నిలిచిన తర్వాత కూడా సుస్మిత తానే పరకాల నాదే అని ప్రకటించడం సంచలనంగా మారే అవకాశం ఉంది.. మరో సారి రాజకీయ వివాదాలకు కేంద్రంగా పరకాల కానున్నదన్న చర్చ జరుగుతోంది..
—————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
