AAP leader Satyendar Jain arrested
* రూ. 152 కోట్ల ఎస్టీపీ టెండర్ల స్కామ్
ఆకేరు న్యూస్, డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) పరిధిలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల ఆధునీకరణ టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసులో సత్యేంద్ర జైన్‌తో పాటు ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈవో ఉదిత్ ప్రకాష్ రాయ్, మాజీ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవతో సహా మొత్తం ఆరుగురిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
* రూ. 1.52 కోట్ల లంచం డిపాజిట్, టెండర్ల నిబంధనల ఉల్లంఘన..
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ప్రైవేట్ సంస్థ ‘యూరోటెక్ ఎన్విరాన్మెంట్’కు అనుకూలంగా టెండర్ల నిబంధనలను సవరించి, పోటీ లేకుండా చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యూహాత్మక అక్రమాల ద్వారా వచ్చిన లంచం నిధులలో సుమారు రూ. 1.52 కోట్లు ఉదిత్ ప్రకాష్ రాయ్, ఆయన బంధువుల బ్యాంక్ ఖాతాలకు మళ్లినట్లు ఏసీబీ దర్యాప్తులో ఆధారాలు లభించాయి.
డబ్బుల చేతులు మారిన ఆధారాలతో పాటు డిజిటల్ సాక్ష్యాలు, నిందితుల మధ్య నడిచిన కమ్యూనికేషన్ పత్రాలను విశ్లేషించిన తర్వాతే అరెస్టులు చేసినట్లు ఏసీబీ తెలిపింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
