Narsampet Peddi Sudarshan Reddy Statue Controversy
* బీఆర్ఎస్ భారీ ర్యాలీ, ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, నర్సంపేట:
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీను ఆధ్వర్యంలో దుగ్గొండి నుంచి నర్సంపేట వరకు నిర్వహించిన భారీ ర్యాలీతో నర్సంపేట పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తొలగించిన ప్రదేశంలోనే పెద్ది విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్టించే వరకు పోరాటం ఆపేది లేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
