Railway Projects Meeting
* రైల్వే ప్రాజెక్టులపై కీలక సమవేశం
* హాజరైన దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఎంపీలు
* పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే ప్రాజెక్టులపై కీలక సమావేశం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో చర్చించారు. ప్రాజెక్టులకు చెందిన పలు ప్రతిపాదనలను ఎంపీలు ఆయనకు అందజేశారు.
* తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ముగ్గురు ఎంపీల చొప్పున హాజరయ్యారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ఎంపీలు ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, వంశీకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ కడియం కావ్య, పెద్దపల్లి ఎంపీ గడ్డమ్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
* ప్రాజెక్టులపై చర్చ
సమావేశానికి హాజరైన ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, పెండింగ్ రైల్వే లైన్ల పనులు మరియు స్థానిక స్టేషన్లలో దూరప్రాంత రైళ్లకు కొత్త స్టాప్‌లు కల్పించడంపై అధికారులకు వినతులు సమర్పించారు. సౌత్ సెంట్రల్ రీజియన్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, లైన్ల రెట్టింపు (దబ్లింగ్) మరియు కొత్త లైన్లకు సంబంధించిన పనులపై ప్రధానంగా చర్చించారు. కరీంనగర్ – కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయడం, పెద్దపల్లి – నిజామాబాద్ లైన్ డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
* కొత్త రైళ్ల ప్రతిపాదనలు
ఈ సమావేశంలో ఎంపీలు కొత్త రైళ్ల ప్రతిపాదనలను కూడా అధికారుల ముందు ఉంచారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రైళ్లను ప్రారంభించాలని, కొన్నింటిని విస్తరించాలని కోరారు. తిరుపతి – కరీంనగర్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను విస్తరించాలని, నిజామాబాద్ – కాజీపేట (వయా పెద్దపల్లి) మధ్య డెమూ రైలును నడపాలని ఎంపీలు ప్రతిపాదించారు. ముఖ్యంగా తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ పనులను త్వరగా ముగించాలని అధికారు దృష్టికి తెచ్చారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసిన వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వసతుల మెరుగుదల, స్థానిక ముఖ్య స్టేషన్లలో దూరప్రాంత రైళ్లకు కొత్తగా స్టాప్ల పునరుద్ధరణపై కీలకంగా సమీక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
