AP Mega DSC Irregularities
* కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్
* చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు
* తప్పు చేశారు కాబట్టే సీబీఐ విచారణకు వెనుకడుగు
ఆకేరున్యూస్, అమరావతి : మెగా డీఎస్సీలో అక్రమాలు జరగడం వాస్తవమని, ప్రభుత్వం కూడా అంగీకరించే పరిస్థితికి వచ్చిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు మీడియా సమావేశంలో ఆయన కీలక ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీలో సుదీర్ఘ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. తప్పు చేశారు కాబట్టే కంగారుపడుతున్నారని, సీబీఐ విచారణకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
* అందుకే ప్రతిపక్షం ఇవ్వట్లే..
అసెంబ్లీలో తమకు ప్రతిపక్షహోదా ఇవ్వకపోవడంపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హోదా ఇస్తే సీఎంకు ఇచ్చినంత సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇవ్వాల్సి ఉంటుందనే ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ప్రత్యర్థి జట్టు లేనిచోట, బౌలింగ్, పీల్డింగ్ లేకుండా, తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు. తాము అద్భుతంగా చేశామని చెబుతున్నారని అన్నారు. డీఎస్సీ స్కాం ఇక్కడ నుంచే మొదలుపెట్టార్నది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ ప్రశ్నలకు అసెంబ్లీలో అబ్బా, కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పడం లేదదని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
* లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ అక్రమాలపై ప్రతిపక్షం లేని శాసనసభలో మాట్లాడుతున్నారుకానీ, మండలిలో ఎందుకు చర్చకు రావడం లేదని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని తమ ఎమ్మెల్సీలు స్తంభింపచేశారని తెలిపారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టే చర్చకు రావడం లేదన్నారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారని తెలిపారు. తాము లేవనెత్తిన కీలక అంశంకూడా అదే అన్నారు.
* ఫస్ట్ ర్యాంక్.. అయినా ఉద్యోగం ఇవ్వలే
డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంకు వచ్చినట్లు ప్రభుత్వం ఒప్పుకుందని, మరి అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని జగన్ ప్రశ్నించారు. ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఉందని, అతడి పేరు తీసేసి, రెండో మెరిట్‌లిస్ట్ ఎందుకు తెచ్చారని అన్నారు. మరి నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటే, తండ్రీ కొడుకులిద్దరూ ఒకే విషయాన్ని చెప్పారన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతడు రాలేదు కాబట్టి, పోస్టు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఫైల్ చేసి, అధికారులతో కూడా ఇదే విషయాన్నిచెప్పించారన్నారు. మరి నేను వారిద్దరినీ అడుగుతున్నా, అతడి ఐడీని బ్లాక్‌చేసి, కాల్‌లెటర్ పంపనప్పుడు, ఆ నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాన్ని ఆధారాలతో అతను హైకోర్టులో అఫిడవిట్ వేశాడు కదా? అన్నారు.
* అందుకే సింధూ పేరు తెరపైకి..
తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నాడని జగన్ విమర్శించారు. సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ – ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. మరి, తర్వాత వచ్చేవాళ్లు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏంటంటే.. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోడానికి స్పెషల్‌గా Go.No.4, Go.No.47 ఇచ్చి, గేట్లు ఎత్తారని, ఆతర్వాత పని పూర్తికాగానే Go.No.25, Go.No.56 ఇచ్చి, మళ్లీ గేట్లు మూసేశారని అన్నారు. ఇలా మరిన్ని ఉదాహరణలు, ఆధారాలతో చంద్రబాబు, లోకేష్‌పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
