Station Ghanpur Road Accident
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
కొత్తిమీర కోసం వెళ్లి… తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై గాదే అశ్విత్ (18) మృతి చెందగా శ్రీకాంత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు
కథనం ప్రకారం… నమిలిగొండకి చెందిన గాదే ధశరథం, కోమల దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు. శుక్రవారం గ్రామంలో వనభోజనాలకు వెళ్లగా కొత్తిమీర తెమ్మని కుటుంబ సభ్యులు పురమాయించడంతో అశ్విత్(సామేల్ పాల్) 18 తన మేనమామ శ్రీకాంత్ తో కలిసి బైక్ పై స్టేషన్ ఘన్ పూర్ వెళ్లి వస్తుండగా నమిలిగొండకు క్రాస్ రోడ్ వద్ద జఫర్గడ్ నుండి స్టేషన్ ఘన్ పూర్ వస్తున్న టిజి 36టి 1177 నంబరు గల లారీని డొకొట్టారు. ఈ సంఘటనలో బైక్ పై వస్తున్న అశ్విత్ అక్కడిక్కడే మృతి చెందగా, శ్రీకాంత్ కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం యంజీయం తరలించినట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
