Minsiter Konda Surekha Letters Congress
* కాకరేపుతున్న కొండా సురేఖ లేఖల ఎపిసోడ్..
* రెండో లేఖపై క్రమశిక్షణ కమిటీ దృష్టి
అకేరు న్యూస్ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ లేఖల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. దీంతో ఇప్పటివరకు ఆమె నుంచి క్రమశిక్షణ కమిటీకి రెండు లేఖలు అందినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడించారు.
కొండా సురేఖ రాసిన రెండో లేఖ తమకు అందిందని మల్లు రవి తెలిపారు. రెండు లేఖలను పరిశీలిస్తున్నామని, క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ లేఖలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ లేఖల్లో ప్రస్తావించిన అంశాలు, ఆమె చేసిన ఫిర్యాదులపై కమిటీ ఏ విధంగా స్పందించనుందన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య వివాదాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ లేఖల వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
క్రమశిక్షణ కమిటీ లేఖలను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కమిటీ చర్చలు, తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
