Thorrur Smart Ration Cards
* స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం: తహసిల్దార్ గాడిపెల్లి శ్రీనివాస్
ఆకేరు న్యూస్,తొర్రూరు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ (MPDO) కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దివి.24.08.2026 సోమవారం ఉదయం 9:30 లకు నిర్వహించనున్నట్లు తహసిల్దార్ (MRO) గాడిపెల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) యశస్విని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఉదయం 9:30 గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కావున, తొర్రూరు మండల పరిధిలోని లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు అందరూ నిర్ణీత సమయానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసిల్దార్ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
