TOSA OASISCON 2026
* మూడు రోజులపాటు ఘనంగా TOSA–OASISCON 2026
* ఆధునిక ఆర్థోపెడిక్ వైద్యంలో నూతన సాంకేతికతలపై వైద్యుల అవగాహన
అకేరు న్యూస్ హనుమకొండ: హనుమకొండ వేదికగా మూడు రోజులపాటు నిర్వహించిన ప్రతిష్టాత్మక TOSA–OASISCON 2026 – Orthopaedic Association of South Indian States Conference ఘనంగా ముగిసింది. దక్షిణ భారతదేశంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, సర్జన్లు, నిపుణులు ఈ సదస్సుకు హాజరై ఆధునిక వైద్య రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలు, చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సా పద్ధతులపై తమ అనుభవాలను పంచుకున్నారు.
OASIS అధ్యక్షులు డా. పెసరు విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్‌లో TOSA–OASISCON 2026ను విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు ఒకే వేదికపైకి వచ్చి తమ నైపుణ్యం, అనుభవాలను పంచుకోవడం సదస్సుకు ప్రత్యేకతను తీసుకొచ్చిందన్నారు.
ఆధునిక వైద్య రంగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోబోటిక్ సర్జరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ వంటి ఆధునిక విధానాలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువ వైద్యులకు సీనియర్ వైద్యుల అనుభవం అందేలా మరిన్ని CMEలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దక్షిణ భారతదేశంలోని ఆర్థోపెడిక్ వైద్యుల మధ్య జ్ఞాన మార్పిడి, వైద్య విద్య, శిక్షణ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇస్తానని డా. విజయచందర్ రెడ్డి తెలిపారు. సదస్సు విజయవంతానికి సహకరించిన వైద్యులు, స్పీకర్లు, నిర్వాహకులు, వాలంటీర్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
* డా. వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం
సదస్సులో భాగంగా ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డా. వేదుల సత్యనారాయణమూర్తి Memorial Oration నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య రంగానికి, వైద్య విద్యకు ఆయన అందించిన సేవలను వైద్యులు స్మరించుకున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషి నేటి తరం వైద్యులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
* OASIS సెక్రటరీ జనరల్ డా. కె. రామ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ
TOSA–OASISCON 2026లో నిర్వహించిన శాస్త్రీయ కార్యక్రమాలు వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని తెలిపారు.
Live Demonstrations, Saw Bone Workshops, Hands-on Training ద్వారా వైద్యులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక శస్త్రచికిత్సా విధానాలను ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశం పొందారని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం ద్వారా వైద్య రంగానికి మేలు జరిగిందన్నారు.
భవిష్యత్తులో OASIS ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికతలు, పరిశోధనలు, CMEలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని డా. రామ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
వరంగల్‌లో ఇంతటి భారీ సౌత్ ఇండియా స్థాయి ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించడం సంతోషకరమని, సదస్సు విజయానికి కృషి చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
* TOSA అధ్యక్షుడిగా డా. అల్వాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
సదస్సులో భాగంగా తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (TOSA) అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన డా. అల్వాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పలువురు వైద్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డా. వద్దిరాజు రాకేష్, డా. పి. సుధీర్ కుమార్, డా. మహేశ్వర్, డా. శ్రవణ్, డా. బంగారు స్వామి, డా. శిరీష్ తదితర ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు సాగిన ఈ సదస్సు ఆధునిక ఆర్థోపెడిక్ వైద్య విధానాలపై నిపుణుల మధ్య జ్ఞాన మార్పిడికి, యువ వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణకు వేదికగా నిలిచింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
