EPFO APFC Recruitment
* EPFOలో 80 పోస్టులు..
ఆకేరు న్యూస్, డెస్క్:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో గ్రూప్-A అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* 80 పోస్టులు.. కేటగిరీల వారీగా
మొత్తం 80 ఖాళీల్లో 29 పోస్టులు UR, 8 EWS, 18 OBC, 15 SC, 10 ST కేటగిరీలకు కేటాయించారు. దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు 3 పోస్టులు రిజర్వ్ చేశారు.
* విద్యార్హత..
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంపెనీ లా, లేబర్ లాస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో డిప్లొమా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
* వయోపరిమితి
కేటగిరీలను బట్టి గరిష్ట వయోపరిమితి ఇలా ఉంటుంది..
UR / EWS: 35 సంవత్సరాలు
OBC: 38 సంవత్సరాలు
SC / ST: 40 సంవత్సరాలు
PwBD: నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు
* జీతం ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్-10 పే స్కేల్ లభిస్తుంది. ఇది గ్రూప్-A హోదాతో కూడిన శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఎంపికైన వారికి ప్రారంభంలో ఒక సంవత్సరం ప్రొబేషన్ ఉంటుంది.
* ఎంపిక విధానం
APFC పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. తొలుత పెన్ అండ్ పేపర్ ఆధారిత Recruitment Test (RT) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. తుది ఎంపికలో రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు.
* దరఖాస్తు ఫీజు
జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.25 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
* ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 11, 2026 రాత్రి 11:59 గంటలు. APFC రిక్రూట్మెంట్ టెస్ట్‌ను డిసెంబర్ 20, 2026న నిర్వహించనున్నట్లు సమాచారం.
* ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు UPSC అధికారిక ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
* అధికారిక నోటిఫికేషన్ : https://www.upsc.gov.in/sites/default/files/AdvtNo-52-2026-Special-Engl-210826.pdf
* అప్లై లింక్ : https://upsconline.nic.in/
Please tell us what is wrong. Your report will be sent to the website team.
