Hyderabad Nepali Youth Murder
* హైదరాబాద్లో దారుణం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నేపాలీ యువకుడిని ఇద్దరు వ్యక్తులు పిడిగుద్దులు గుద్ది హతమార్చారు. నేపాల్ కి చెందిన నాగేందర్ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో నడుచుకుంటూ గోల్డెన్ హైట్స్ కాలనీ వద్ద వస్తుండగా వెనకాల నుండి ఒక యాక్టివా మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడిని ఆపారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను లాక్కున్నారు. ఇచ్చేందుకు నిరాకరించడంతో అతనిపై ఒక్కసారిగా పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీంతో నాగేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
* ఇంకా రాలేదేంటి?
ఉదయం బయటకు వెళ్లిన వ్యక్తి ఇప్పటి వరకు రాలేదేంటని నాగేందర్ కుటుంబ సభ్యులు విచారణ మొదలు పెట్టారు. అతడి కోసం గాలిస్తుండగా రోడ్డుపై నాగేందర్ మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు నాగేంద్ర పై దాడి చేస్తున్న దృశ్యాల్లో సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. హత్య చేసిన అనంతరం నిందితులు తమ వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* సెల్ ఫోన్ కోసమే చంపారా?
సెల్ఫోన్ లాక్కుంటున్నట్లుగా సీసీఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఏంటి? నిందితులు ఎవరు? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు నేపాలీకి చెందిన వాడు కావడంతో అతడికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
