Harish Rao House Arrest
* వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును పోలీసులు గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లేందుకు సిద్ధమవ్వగా, పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు.
* జీవో 97 రద్దు చేయాలని డిమాండ్..
వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారి ఆందోళనకు మద్దతుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు చర్యగా హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకుని భారీగా మోహరించారు.
* నివాసం వద్ద ఉద్రిక్తత..
హరీష్ రావు నివాసం బయటకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల న్యాయమైన సమస్యలపై మాట్లాడేందుకు వెళ్తున్న తనను కావాలనే అడ్డుకుంటున్నారని హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అణచివేత ధోరణి వీడాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
