Raksha Bandhan Tragedy in Kuravi
* కన్నీటితో రాఖీ కట్టిన సోదరి
అకేరు న్యూస్ మహబూబాబాద్: రక్షాబంధన్ పర్వదినం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. రాఖీ కట్టాల్సిన తమ్ముడికి సోదరి కన్నీటితో రాఖీ కట్టిన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్ (36) అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు.
బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. పాడెపై ఉన్న తమ్ముడి మృతదేహాన్ని చూసిన సోదరి ధనలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ‘రాఖీ కట్టక ముందే పాడెనెక్కావా తమ్ముడూ’ అంటూ విలపిస్తూ రమేశ్ మృతదేహానికి రాఖీ కట్టారు.
* ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఇదిలా ఉండగా.. రమేశ్ తండ్రి వీరన్న కూడా పది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. కేవలం పది రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
రక్షాబంధన్ రోజున జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
