Vinay Bhaskar House Arrest
ఆకేరు న్యూస్, హనుమకొండ:
జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన బిఆర్ఎస్ నాయకుడు, మాజీ చీఫ్ విప్, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
విద్యార్థుల ఆందోళన ప్రాంతానికి ఆయన వెళ్లకుండా హనుమకొండలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. నివాసం నుండి బయటకు రాకుండా పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. విద్యార్థుల నిరసనలకు మద్దతు ఇవ్వకుండా పోలీసులు తమను అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
