Bihar Buffalo DNA Test
* గేదె కు డీ ఎన్ ఏ పరీక్ష – గేదె యజమాని కోసం రంగంలోకి డీఎన్ఏ పరీక్ష!
అకేరు న్యూస్ : బిహార్‌లో ఓ గేదె వివాదం పోలీస్‌స్టేషనుకు చేరి, ఇప్పుడు డీఎన్ఏ పరీక్ష దాకా వెళ్లింది. గయా జిల్లాకు చెందిన ఈ గేదె అసలు యజమాని ఎవరో నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యేవరకు గేదెను పోలీసుల అధీనంలోనే ఉంచాలని ఎస్పీకి సూచించారు.
జిల్లాలోని అతరీ పోలీస్‌స్టేషను పరిధికి చెందిన సూరజ్ యాదవ్ గేదె కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయింది. నౌరంగా టోలీలోని ప్రకాశ్ మాంఝీ తన ఇంట్లో గేదెను కట్టేసి ఉంచారని సూరజ్‌కు సమాచారం అందింది. దీంతో గేదె నాది అంటే.. నాదే అంటూ ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
వివాదం నానాటికీ ముదిరి ఎంతకూ తెగకపోవడంతో డీఎన్ఏ పరీక్షకు ఐజీ ఆదేశించారు. డీఎన్ఏ సాయంతో ఆ గేదె తల్లిదండ్రుల సంబంధ ధ్రువీకరణ ద్వారా యాజమాన్యాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
