Heroine Swetha Lakshman, Sahaa Movie
* హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ‘సాహా’ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో “సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా” అనే వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ ఈ సవాల్ విసిరింది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు నటీనటులు తమ చిత్రంపై అంచనాలు, నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు.
* సినిమాపై భారీ నమ్మకం
తాను నటించిన ‘సాహా’ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శ్వేత లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. సమాచారం. కథ, పాత్రలు, సినిమాలోని అంశాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
* వైరల్గా మారిన వ్యాఖ్య
శ్వేత లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటి సవాళ్లు అవసరమా అంటూ స్పందిస్తున్నారు. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల తీర్పే అంతిమమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్వేత లక్ష్మణ్ వ్యాఖ్యకు సంబంధించిన వీడియో, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
