Nagarjuna 100th Movie King 100
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. తాత్కాలికంగా ‘కింగ్ 100’ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో తమిళ నటుడు అశోక్ సెల్వన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది
* అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్
తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘నిత్తం ఒరు వానం’లో అశోక్ సెల్వన్ హీరోగా నటించారు. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో నాగార్జునకు ఎదురుగా అశోక్ సెల్వన్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
* యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్
తన 100వ సినిమా గురించి గతంలో నాగార్జున మాట్లాడుతూ ఇది భారీ స్థాయిలో తెరకెక్కే యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా అని వెల్లడించారు. ఈ కథను రా కార్తిక్ తనకు ఏడాది క్రితమే వినిపించారని, సుమారు ఆరు నుంచి ఏడు నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని జరుగుతోందని నాగార్జున
* పుట్టినరోజున టైటిల్ గ్లింప్స్?
నాగార్జున ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్‌ను అదే రోజున విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
