Visakhapatnam Girl Kidnap Case
* స్కూటీ నంబర్‌తో ఛేదించిన విశాఖ పోలీసులు
అకేరు న్యూస్ విశాఖపట్నం : విశాఖలో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు బాలికను అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
కిడ్నాప్‌కు ఉపయోగించిన స్కూటీ నంబర్‌ను కీలక ఆధారంగా తీసుకున్న పోలీసులు.. దాని ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో బాలికను యలమంచిలి సమీపంలో గుర్తించిన పోలీసులు సురక్షితంగా కాపాడారు. కిడ్నాప్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
బాలికను ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటి..? నిందితులు బాలికను ఎక్కడికి తీసుకెళ్లారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
