Veligonda Project Water Release
* 31న నీళ్ల విడుదల
అకేరు న్యూస్ అమరావతి : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్వాసితులకు రూ.910 కోట్ల ప్యాకేజీ చెల్లించామని తెలిపారు.
అర్హులైన నిర్వాసితులకు మరో రూ.169 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
అలాగే 18 ఏళ్లు నిండిన యువ నిర్వాసితులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. మహిళలను గౌరవించేలా పసుపు కుంకుమ, చీరలతో సత్కరిస్తామని తెలిపారు.
31న వెలిగొండ నీటి విడుదల కార్యక్రమం నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో సందడి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
