Rashmika Mandanna to star in a biopic
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితకథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక పాత్రలో నటి రష్మిక మందన్న కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
* సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర
సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన సుబ్బలక్ష్మి జీవితంలోని కీలక ఘట్టాలు, ఆమె సంగీత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉంది. అలాంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించడం రష్మికకు కూడా ఒక ప్రత్యేకమైన సవాలుగా మారనుంది. రష్మిక ఇప్పటివరకు విభిన్న తరహా పాత్రల్లో నటిస్తూ తనలోని నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే సుబ్బలక్ష్మి వంటి చారిత్రక, సంగీతపరమైన వ్యక్తిత్వాన్ని పోషించాలంటే హావభావాలు, మాట తీరు, శరీర భాషతో పాటు సంగీత ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలపై కూడా అవగాహన అవసరం అవుతోంది.
* లుక్ ఒకేనా?
ఒక క్లాసికల్ ఐకాన్ పాత్రలో రష్మిక నటించడం ఆమె కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.ఇప్పటికే రష్మికకు లుక్ టెస్ట్ నిర్వహించారు. ఆమె లూక్స్ చూసి మేకర్స్ ఒకే అన్నట్లు టాక్ . జెర్సీ’ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ మరియు కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
